ఏపిలో ఒక్కరోజే 796 కొత్త కేసులు..11 మంది మృతి

రాష్ట్రంలో 12 వేలు దాటిన పాజిటివ్ కేసులు

ఏపిలో ఒక్కరోజే 796 కొత్త కేసులు..11 మంది మృతి
coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 24,458 శాంపిల్స్ పరీక్షించగా 796 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో 51 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, మరో ఐదుగురు ఇటీవలే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. కొత్తకేసులతో కలిపి ఏపీలో 12,285 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 11 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 157కి పెరిగింది. తాజాగా ఇప్పటివరకు 5,480 మంది డిశ్చార్జి కాగా, 6,648 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపిలో ఒక్కరోజే 796 కొత్త కేసులు..11 మంది మృతి


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/