చైనా ఒత్తిళ్లకు తలవంచం : తైవాన్‌ అధ్యక్షురాలు

తైపే : చైనా ఒత్తిళ్లకు ఎట్టిపరిస్థితుల్లో తలవంచబోమని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌ పేర్కొన్నారు. ఆదివారం తైవాన్‌ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్య రక్షణకు తాము ముందువరుసలో ఉన్నట్టు తెలిపారు. దుందుడుకు వైఖరి నుంచి చైనా త్వరలోనే వెనక్కి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తైవాన్‌ రక్షణకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/