భారత్​పై ప్రపంచ దేశాల అభిప్రాయం మారింది : ప్రధాని

YouTube video
PM Modi’s address at Aatmanirbhar Arthvyavastha programme organised by BJP

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆత్మనిర్భర్​ పునాదులతో నవభారత్ నిర్మాణానికి ఇది దోహదపడుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలతో వర్చువల్​గా సమావేశమైన ఆయన.. బడ్జెట్​పై ప్రసంగించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు మౌలిక వసతులు కల్పించండంపైనే కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిననట్లు పేర్కొన్నారు.

భారత్​పై ప్రపంచ దేశాల అభిప్రాయం మారింది. మన ఆర్థికవ్యవస్థను అత్యంత వేగంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా తర్వత ప్రపంచ స్థితిగతులు మారాయి. భారత్​ను మరింత పటిష్ఠంగా చూడాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి . భారత్​ను స్వయంసమృద్ధ, ఆధునిక దేశంగా తీర్చిదిద్దడం అత్యంత కీలకం. ఈ బడ్జెట్ నవభారత్​ నిర్మాణానికి మార్గం. కేంద్రం గత ఏడు సంవత్సరాలుగా తీసుకుంటున్న సరైన నిర్ణయాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ విస్తరిస్తోంది. ఏడేళ్ల క్రితం భారత జీడీపీ రూ.లక్షా 10వేల కోట్లుగా ఉంది. ఇప్పుడు రూ.2లక్షల 30వేల కోట్లకు పెరిగింది. దేశ విదేశీ మారక నిల్వలు 200 నుంచి 630 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ సమర్థవంతమైన విధానాల వల్లే ఇది సాధ్యమైంది. సరిహద్దు గ్రామాల నుంచి వలసలు దేశ భద్రతకు మంచిది కాదని మోడీ అన్నారు. అందుకే ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్​లో కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/