మీతో కలసి పోరాడుతానని భరోసా ఇస్తున్న

అమరావతే రాజధానిగా ఉంటుందని హామీ ఇవ్వలేను

Pawan
Pawan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు అమరావతి రైతులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారంటూ ప్రభుత్వం పైగుప్పించారు. అమరావతే రాజధానిగా ఉంటుందని తాను హామీ ఇవ్వలేనని… అయితే, మీతో కలసి పోరాడుతానని భరోసా ఇచ్చారు. ఢిల్లీ నేతలు అమరావతికే మద్దతిస్తున్నారని చెప్పారు. తాము చేస్తున్న అన్ని పనులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉందని వైఎస్‌ఆర్‌సిపి నేతలు చెబుతున్న మాటల్లో నిజం లేదని అన్నారు. వెనుకబడిన రాయలసీమకు హైకోర్టును ఇస్తే అడ్డుకోబోమని చెప్పారు.

ప్రస్తుతం విశాఖలో ఇల్లు అద్దెకు దొరికే పరిస్థితి కూడా లేదని అన్నారు. క్విడ్ ప్రోకో అంటే ఏమిటో మీకు తెలసు కదా? అని రైతులను ప్రశ్నించారు. అమరావతిలో టీడీపీ నేతలు తప్పు చేసి ఉంటే… వారిని శిక్షించండని పిలుపునిచ్చారు. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి జగన్ చెప్పాల్సిందని… ఇప్పుడు ప్రజలను నమ్మించి గొంతు కోశారని పవన్ మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రజలు 151 సీట్లను కట్టబెడితే… ప్రజల్లో చివరకు అస్థిరతను నెలకొల్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రోడ్డు పైకి వస్తే అమరావతి తరలింపు ఆగుతుందంటే… రాజధాని ఇక్కడే వుంటుందని హామీ ఇస్తానని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/