బైరెడ్డికి శ్రీరెడ్డి బర్త్‌డే విషెష్..ఎలా చెప్పిందో తెలుసా..?

నేడు వైస్సార్సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా వైస్సార్సీపీ శ్రేణులు , కార్య కర్తలు , ఆయన అభిమానులు ఉదయం నుండి కూడా పలు సేవ కార్య క్రమాలు చేస్తూ నానా హడావిడి చేసారు. అభిమానులైతే భారీ ప్లెక్సీ లు ఏర్పటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

అలాగే నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి సైతం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి విషెష్ అందించింది. అదికూడా రంగస్థలం లోని రంగమ్మ రంగమ్మ సాంగ్ తో.. ‘విష్ యు హ్యపీ బర్త్‌డే బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి.. ఈ పాట నీకు డెడికేట్ చేస్తున్నాను’ అంటూ ‘రంగస్థలం’ సినిమాలోని ‘రంగమ్మ మంగమ్మ’ పాటకు వయ్యారాలు వలికిస్తూ వీడియో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. మెసేజ్ మధ్యలో ఒక కేక్, మూడు హార్ట్ ఎమోజీలు కూడా జోడించింది.

గతంలో కూడా శ్రీ రెడ్డి.. సిద్దార్థ్ రెడ్డి ఫై పలు బోల్డ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని .. ఆయన ఒప్పుకుంటే ఒక్కరోజు భార్యగా ఉంటానని.. ఆయనకు వండి పెట్టి సపర్యలు చేస్తానని.. ఆ తరవాత ఏం ఉంటుందో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చాలా బోల్డ్‌గా కామెంట్స్ చేసింది. తాను సిద్ధా్ర్థ్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని.. కనబడితే మాత్రం వదలను అంటూ పలుమార్లు చెప్పుకొచ్చింది.

https://www.facebook.com/watch/?v=1465429227198928