నేడు కాన్పూర్‌లో పర్యటించనున్న ప్రధాని

కాన్పూర్‌: నేడు ప్రధాని మోడీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. యూపీలోని కాన్పూర్ నగరాన్ని సందర్శించనున్నారు. ఇది కాకుండా, కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి కాన్పూర్) స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. దీనితో పాటు, కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్, బినా పంకీ మల్టీప్రొడక్ట్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ విభాగాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు.

ప్రధాని మోడీ మంగళవారం కాన్పూర్‌లో పర్యటిస్తారు. పట్టణ ప్రాంతంలో పెరగుతున్న జనాభాకు రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంలో భాగంగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1.30 గంటలకు కాన్పూర్ పూర్తయిన మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మొత్తం 9 కి.మీ పొడవు ఐఐటి కాన్పూర్ నుండి మోతీ జీల్ వరకు విస్తరించి ఉంది. అయితే, కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం పొడవు 32 కి.మీ. ఇది రూ. 11,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో ప్రాజెక్టుగా కాన్పూర్ మెట్రో అవతరిస్తోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/