వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ ఇవ్వాలి – సీఎం జగన్ కీలక ఆదేశం

వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దివంగత నేత వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. కొంతమంది తనను చంపేందుకు కుట్ర చేశారని చెప్పడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది.

రాధాను చంపాల్సిన అవసరం ఎవరికుంది.. కుట్ర చేసిన వారి గురించి రాధాకు తెలుసా..? నిజంగానే రాధా మర్డర్ కు ప్లాన్ జరిగిందా..? అంటూ అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి కొడాలి నాని అన్నారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడం తో దీనిపై విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆయన వెంటనే ఇంటెలిజెన్స్‌ డీజీని ఆదేశించారు. మరోవైపు రాధాకు వెంటనే 2+2 సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించినట్లు కొడాలి నాని అన్నారు.

ఇక ఆదివారం వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో వంగవీటి రాధాపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు తమ్ముడని.. బంగారం లాంటి రాధా తాను నమ్మిన దారిలోనే నడుస్తాడంటూ.. మంచి మనిషంటూ పొగడ్తలతో ముంచెత్తారు. “నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నాను.. రాధా టీడీపీలో ఉన్నాడు అనుకుంటా.. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నాయకులు చెప్పినా.. పదవులను ఆశించలేదు. బంగారం లాంటి రాధా.. తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే మరిస్థితి మరోలా ఉండేది. రాగి కలిపితేనే కదా బంగారం కూడా కావాల్సిన ఆకృతిలో వస్తుంది.. కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడు” అంటూ రాధా వ్యక్తీకరణను మంత్రి నాని వివరించారు.