ఈరోజు ఒడిశాలో ప్రధాని మోడీ పర్యటన

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రధాని మోడీ ఒడిశాలో పర్యటించనున్నారు. మూడు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. బరిపాడలో ఆ తర్వాత బాలాసోర్‌లో, కేంద్రపరాలో జరిగే బహిరంగ సభల్లో మోడీ పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మరికాసేపట్లో ఖుషీనగర్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయం సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం డియోరియాకు చెందిన బాబా రాఘవదాస్ ఇంటర్ కళాశాలలోని భట్‌పరాని మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక, చివరగా మధ్యాహ్నం 1:50 గంటలకు గోరఖ్‌పూర్‌లోని మురారీ ఇంటర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 2:50 గంటలకు గోరఖ్‌పూర్‌లోని బన్స్‌గావ్‌లోని సర్వోదయ ఇంటర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో యోగి ఆదిత్యనాథ్ పార్టీ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేయనున్నారు.

ఇదిలా ఉంటె ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కుటేను సస్పెండ్ చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో అనవసరంగా జోక్యం చేసుకున్నందుకు కమిషన్ ఆయనను సస్పెండ్ చేసింది. అదే సమయంలో మెడికల్ లీవ్‌లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి ఆశిష్ సింగ్ ఐజీ (సీఎం సెక్యూరిటీ)ను గురువారంలోగా మెడికల్ బోర్డు ముందు హాజరుకావాలని ఈసీ కోరింది.