నేడు అమెరికా నుండి హైదరాబాద్ కు రానున్న చంద్రబాబు

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు..ఈరోజు అమెరికా నుండి హైదరాబాద్ కు రానున్నారు. ఏపీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు అక్కడ రిస్ట్ తీసుకున్న బాబు నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు పెద్దయెత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు నేడు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటుండటంతో టీడీపీ నేతలు ఆయనను కలిసేందుకు ఉత్సాహపడుతున్నారు.

మే 13 న ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. బిజెపి , జనసేన , టీడీపీ కూటమి గా ఏర్పడి పోటీ చేసాయి. జూన్ 04 న వీటి ఫలితాలు వెల్లడి కాబోతుండడంతో నేతల్లోనే కాదు ప్రజల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? ఎంత మెజార్టీ తో గెలుస్తారనేది తెలుసుకోవాలని ఆసక్తి గా ఉన్నారు. ప్రస్తుతం అనేక సర్వేలు కూటమి విజయం సాదించబోతుందని చెపుతుండడంతో కూటమి నేతలు ధీమా గా ఉన్నారు.