మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌, సీఎం

హైదరాబాద్: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాష్ర్ట మ‌హిళ‌ల‌కు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాల‌ని ఆమె కాంక్షించారు. మ‌హిళ‌ల విజ‌యాలు అంద‌రికీ స్ఫూర్తిస్తున్నారు అని పేర్కొన్నారు. క‌రోనా స‌మ‌యంలో త్యాగం, సాహ‌సంతో వ్య‌వ‌హ‌రించారు అని గ‌వ‌ర్న‌ర్ కొనియాడారు.


సీఎం కెసిఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని ఆయన అన్నారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళ తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారని కొనియాడారు. మహిళలకు అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆయన అన్నారు. మహిళా సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. మహిళలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు పలు పథకాలు అమలుచేస్తున్నామని అన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు దినంగా ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/