24, 25 తేదీలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన

36 గంటల్లో 7 నగరాలు 8 పర్యటనలు

PM Modi to travel over 5,000 km in 36 hours, attend 8 programmes in 7 cities

న్యూఢిల్లీః ప్రధాని మోడీ 24, 25న సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రెండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 36 గంటల్లో 5 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి 7 నగరాల్లో 8 కార్యక్రమాలకు మోడీ హాజరుకానున్నారు. ఏప్రిల్ 24న మోడీ ఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యప్రదేశ్ కు వెళతారు. ఆ తర్వాత కేరళకు.. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.

ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ ..

ప్రధాని మోడీ ఏప్రిల్ 24 మంగళవారం ఉదయం ఢిల్లీ నుండి ఖజురహో వరకు దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. ఖజురహో నుంచి రేవాకు వెళ్లి అక్కడ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి 280 కి.మీ దూరం ప్రయాణించి ఖజురహోకు వెళ్తారు. ఖజురహో నుంచి కొచ్చికి విమానం ద్వారా సుమారు 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి యువమ్ సదస్సులో పాల్గొంటారు.

ఏప్రిల్ 25న ఉదయం ప్రధాని మోడీ కొచ్చి నుంచి తిరువనంతపురం వరకు దాదాపు 1902 కి.మీ దూరం ప్రయాణిస్తారు. అక్కడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఇక్కడి నుంచి సూరత్ మీదుగా దదాపు 1570 కి.మీ మేర సిల్వాస్సాకు వెళ్లి నమో మెడికల్ కాలేజీ సందర్శిస్తారు. అక్కడ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. సూరత్ నుండి సుమారు 110 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి ఢిల్లీకి వెళతారు. ఈ పర్యటన అంతా కేవలం 36 గంటల్లోనే జరుగుతుంది.