ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం జగన్‌ అభినందనలు

సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపు

cm jagan

అమరావతిః భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే. ఈ విషయంపై సిఎం జగన్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేశారని కొనియాడారు. సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.

పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ మొత్తం 25 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఈ మధ్యాహ్నం 2.19 గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రోదసిలోకి దూసుకెళ్లింది. పూర్తిస్థాయి వాణిజ్యపరంగా చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇస్రో ప్రణాళికల్లో పూర్తిస్థాయి వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇది ఐదవది.