నేడు త్రిపురలో పర్యటించనున్న ప్రధాని

అగర్తలా ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేడు త్రిపురలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అగర్తాలాలోని మహారాజా బీర్ బిక్రమ్ (MBB) విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రారంభించబోతున్నారు. భారథ దేశపు ఈశాన్య ప్రాంతంలో రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఇది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ సంవత్సరానికి 3 మిలియన్ల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 30,000 చదరపు మీటర్ల బిల్ట్-అప్ ప్రాంతంతో, కొత్త టెర్మినల్ భవనం రద్దీ సమయాల్లో 1,000 మంది దేశీయ.. 200 అంతర్జాతీయ ప్రయాణీకులను నిర్వహించడానికి రూపొందించారు. ఈ టర్మినల్ అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/