తెలంగాణలో విద్యాసంస్థలకు 8 నుంచి 16 వరకు సెలవులు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొంది.

కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వ సన్నద్ధత సహా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగానే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. అయితే ఈ సెలవుల్లోనే సంక్రాంతి సెలవులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సెలవుల ముగిసే లోపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగితే సెలవులు మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/