ఇన్ఫినిటీ ఫోరమ్‌ను ప్రారంభించనున్న ప్రధాని
PM Narendra Modi
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫిన్‌టెక్‌పై థాట్ లీడర్షిప్ ఫోరమ్ అయిన ఇన్ఫినిటీ ఫోరమ్‌ను శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. GIFT సిటీ, బ్లూమ్‌బర్గ్ భాగస్వామ్యంతో 2021, డిసెంబర్ 3, 4 తేదీల్లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఈ ఇన్ఫినిటీ ఫోరమ్ మొదటి ఎడిషన్‌లో ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, యూకే భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విధానాలు, వ్యాపారం, సాంకేతికతలో ప్రముఖులైన వ్యక్తులను ఈ ఇన్ఫినిటీ ఫోరమ్ ఒక్కచోట చేరుస్తుంది. సమ్మిళిత వృద్ధికి, మానవాళి సేవకు ఫిన్‌టెక్ పరిశ్రమ ద్వారా సాంకేతికత, ఆవిష్కరణలను ఎలా ఉపయోగించవచ్చనే అంశంపై ఆ ప్రముఖుల చర్చకు, కార్యాచరణకు ఈ ఇన్ఫినిటీ ఫోరమ్ తోడ్పడుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/