బాణసంచా కాల్చడం పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

నవంబర్ 04 దీపావళి సందర్భాంగా వారం ముందు నుండే దీపావళి వేడుకలు మొదలయ్యాయి. ఈ సమయంలో ఫైర్‌ క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బాణసంచాపై పూర్తి స్థాయిలో నిషేధం విధించలేదని.. బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాకర్స్ పై మాత్రమే నిషేధం ఉంటుందని జస్టిస్ ఎంఆర్​ షా, జస్టిస్ ఏ ఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

వేడుకల పేరుతో సీనియర్ సిటిజన్లు పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని తేల్చిచెప్పింది. భారత రాజ్యాంగం లోని 21వ అధికరణ వారికి రక్షణ కల్పిస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రాలు ఏజెన్సీలు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తప్ప కుండా పాటించాలని అతిక్రమిస్తే తీవ్రం గా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. ఉత్సవాల పేరు తో పర్యావరణానికి హానికరమైన బాణా సంచా కాల్చడానికి వీల్లేదని న్యాయ స్థానం స్పష్టం చేసింది. బాణ సంచా తయారీ వినియోగం నిషేధిత బాణసంచా అమ్మ కాలకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా స్థానిక కేబుల్ సర్వీసుల ద్వారా ప్రచారం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించి నా కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం హెచ్చరించింది.