కొడాలి నాని.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా..కొల్లు రవీంద్ర సవాల్

కొడాలి నాని.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా..కొల్లు రవీంద్ర సవాల్

వైసీపీ మంత్రి కొడాలి నాని ఫై..మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విరుచుకపడ్డాడు. ‘కొడాలి నానీ.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా.. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తిట్టేంత వాడివా..’ అంటూ ఓ రేంజ్ లో సవాల్ విసిరారు.

తెలుగుదేశం పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అధ్యక్షతన మచిలీపట్నం పార్లమెంట్‌ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆడపడుచుల ఆత్మగౌరవ సభ లో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. వైసీపీ ప్రజాప్రతినిధులు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, పవిత్రమైన చట్టసభల్లో మహిళలను కించపరుస్తున్న వారి దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆడపడుచులకు పిలుపునిచ్చారు.

మంత్రి పేర్ని నాని సొంత నియోజకవర్గంలోని బందరు బస్టాండ్‌ ముంపునకు గురవుతుంటే పట్టించుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి మొదలగు వారు పాల్గొన్నారు.