రేపు ఏడు రాష్ట్రాల సిఎంలతో ప్రధాని భేటి

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: రేపు ఏడు రాష్ట్రాల సిఎంలతో ప్రధాని నరేంద్రమోడి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో సిఎంలతో పాటు ఆ ఏడు రాష్ట్రాల ఆరోగ్య‌మంత్రులు కూడా పాల్గొన‌నున్నారు. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న తీరు, ఆ వైర‌స్‌ను అరిక‌ట్ట‌డానికి చేప‌డుతున్న చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. కాగా కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాలు/‌కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో మహారాష్ట్ర , ఏపి, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి. ఈ ఏడు రాష్ట్రాల సిఎంలతో ఆరోగ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోడి సెప్టెంబ‌ర్ 23న ఉన్న‌త‌స్థాయి భేటీ నిర్వ‌హించ‌నున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ‌


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/