ఐఐటీ గువాహటి కాన్వకేషన్‌లో పాల్గొన్న ప్రధాని

YouTube video
PM Narendra Modi addresses the Convocation of IIT, Guwahati

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఐఐటీగువాహ‌టి కాన్వ‌కేష‌న్‌లో ఈ ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’నేడు మీలాంటి యువ‌త మెద‌ళ్ల‌లో మెదులుతున్న‌ ఆలోచ‌న‌లే రేప‌టి భార‌త‌దేశ‌పు భ‌విష్య‌త్తు’ అని ఐఐటీ గువాహ‌టి విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని పేర్కొన్నారు. ‘మీ భవిష్య‌త్తు కోసం మీరు కంటున్న క‌ల‌లే నిజ‌మైన భార‌త‌దేశానికి రూపాన్ని ఇస్తాయ‌ని’ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది భ‌విష్య‌త్తు నిర్మాణానికి స‌న్న‌ద్ధం కావాల్సిన స‌మ‌య‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడితోపాటు అసోం ముఖ్య‌మంత్రి స‌ర్బానంద సోనోవాల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ కూడా పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/