డీమార్ట్‌ సిబ్బంది దాడిలో విద్యార్థి మృతి

d mart vanasthalipuram
d mart vanasthalipuram

హైదరాబాద్‌: వనస్థలిపురం డీమార్ట్‌ వద్ద నిన్న రాత్రి దారుణం జరిగింది. నల్గొండ జిల్లాకి చెందిన సతీష్ నాయక్ అనే విద్యార్థి డీమార్ట్‌లో మృతి చెందడం కలకలం రేపింది. హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సతీష్ నాయక్ అనే విద్యార్థి తన ఇద్దరు స్నేహితులతో కలిసి గత రాత్రి 9:30 గంటలకు డీమార్ట్‌కు వెళ్లాడు. ఈ ముగ్గురు విద్యార్థులకు డీమార్ట్ సిబ్బందితో గొడవ జరిగింది. గొడవ కాస్త ముదరడంతో సతీష్ స్నేహితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే డీమార్ట్‌లో జరిగిన ఘర్షణలో సతీష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే డీమార్ట్ సిబ్బంది సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే సతీష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. సతీష్‌ను డీమార్ట్ సిబ్బందే కొట్టి చంపారని సతీష్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/