విమాన టికెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చు కానీ….

లాక్‌డౌన్‌ పొడగిస్తే టికెట్స్‌ రద్దు అవుతాయి.

aeroplane
aeroplane

దిల్లీ: దేశంలో కరోనా నివారణకు లాక్‌డౌన్‌ విధించడంతో దేశంలోని అన్ని విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను నిలిపివేశాయి. కాగా ఈ నెల 14 తో లాక్‌డౌన్‌ సమయం ముగియనుండడంతో, 15వ తేది నుండి తమ సర్వీసులను ప్రారంభించడానికి విమాన సంస్థలు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే టికెట్‌ బుకింగ్స్‌ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతుంది. అందువల్ల 14 వరకు పరిమిత సంఖ్యలోనే దేశవాళీ, అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తాం. ఏప్రిల్‌ 14 తరువాత బుకింగ్స్‌ స్వీకరించే వెసులుబాటును ఎయిర్‌లైన్స్‌ కు కల్పించాం, కాని లాక్‌డౌన్‌ కొనసాగితే మాత్రం విమానాలు రద్దు అవుతాయని, బుక్‌ చేసుకున్న టికెట్స్‌ కూడా క్యాన్సిల్‌ అవుతాయని, పౌరవిమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/