నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

సాయంత్రం 4 గంటలకు ప్రసంగం..

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.  ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి, దాని నిర్మూల‌న‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పైనే ఆయ‌న మాట్లాడే అవకాశం ఉన్న‌ది. దేశ‌వ్యాప్తంగా కరోనా ర‌క్క‌సి క‌రాళ నృత్యం చేస్తున్న నేప‌థ్యంలో ప్రజలకు మరోసారి ప్ర‌ధాని కీలక సూచనలు, స‌ల‌హాలు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా గ‌ల్వాన్‌లో లోయ‌లో భార‌త్‌-చైనా దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌ను కూడా ప్ర‌ధాని త‌న‌ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించే అవ‌కాశం ఉన్న‌ది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/