క్యాసినో కేసు.. నేడు మరోసారి ఈడీ విచారణకు చికోటీ ప్రవీణ్

chikoti-praveen-to-be-investigated-by-ed-again-today-in-casino-case

హైదరాబాద్‌ః చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈరోజు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. క్యాసినో కేసులో గతంలోనే చికోటి ప్రవీణ్ ని ఈడీ విచారించింది. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్స్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. థాయిలాండ్ లో గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరికిన తర్వాత మరోసారి నోటీసులిచ్చింది. ఆర్థిక లావాదేవీలతో పాటు…నగదు బదిలీపై చికోటిని ప్రశ్నించనుంది ఈడీ. చికోటి ప్రవీణ్ తో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డి లకు ఈడీ నోటీసులిచ్చింది. ఇప్పటికే ట్రావెల్ ఏజెంట్ సంపత్ ఈడీ విచారణకు హాజరయ్యారు.

కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన 91 మంది జూదం ఆడుతుండగా మే 1 సోమవారం తెల్లవారుజామున చౌనబురి ప్రావిన్స్‌ పోలీసులు దాడిచేశారు. 83 మంది భారతీయులతో పాటు 91 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను అరెస్ట్ చేసింది.