మన్మోహన్‌ సింగ్‌ కు తీవ్ర అస్వస్థత..ఒక్కసారిగా క్షీణించిన ఆరోగ్యం

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (88) ఢిల్లీ ఎయిమ్స్‌ హాస్పటల్ లో చేరారు. జ్వరంతో బాధపడుతున్న మన్మోహన్‌ సింగ్‌ కు ఆరోగ్యం ఒక్క సారిగా క్షీణించింది. దీంతో ఆయన్ను దేశ రాజధాని ఢిల్లీ లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి లో కుటుంబ సభ్యులు చేర్పించారు. మన్మోహన్‌ సింగ్‌ కు ఎయిమ్స్‌ వైద్యులు ప్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నట్లు సమాచారం.

ఆయన కు శ్వాస సమస్యలతో పాటు చెస్ట్‌ పెయిన్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. రేపు ఉదయం మరోసారి ఆయన హెల్త్‌ బులిటెన్‌ ను విడుదల చేయనుంది ఎయిమ్స్‌ వైద్యుల బృందం. మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19 న కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయననను ఎయిమ్స్‌లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత అతనికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత మార్చి 4, ఏప్రిల్ 3 న రెండు మోతాదుల కరోనా వ్యాక్సిన్‌లను కూడా తీసుకున్నారు. 2009 లో మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. మన్మోహన్ ఆరోగ్య పరిస్థితి ఫై కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.