నేడు రాజమండ్రి కి ప్రధాని మోడీ రాక..

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రధాని మోడీ రాజమండ్రికి రాబోతున్నారు. ఈ తరుణంలో నగరంలో ఆంక్షలు విధించారు పోలీసులు. మరో వారం రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాజమండ్రి వేమగిరి సెంటర్లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇటు సీఎం జగన్ బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరాపుపేట లోక్‌సభ పరిధిలోని మాచర్లలో జరిగే సభకు ఆయన హాజరవుతారు. తిరిగి సాయంత్రం మచిలీపట్నంలో జరిగే ప్రచారంలో ఆయన పాల్గొంటారు. జగన్ సభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాంగ్రెస్ చీఫ్ షర్మిల సైతం ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరు నియోజక వర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం కొనసాగంచనున్నారు. ఉదయం రామేశ్వరం 4 రోడ్ల జంక్షన్ వద్ద నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కాలేజి క్రాస్ రోడ్, రిషి అపార్ట్మెంట్,వాసవి కళ్యాణ మండపం,భగత్ సింగ్ కాలనీ, సంజీవ్నగర్, శ్రీనివాస్‌న‌గ‌ర్, శివాలయంసెంటర్, జిన్నారోడ్, అమృతనగర్, ఖాదర్ బాద్ మీదుగా ప్రచారం కొనసాగించ‌నున్నారు.