నగరంలో ప్రధాని రోడ్‌ షో..ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ చేరుకున్న మోడీ

PM Modi Massive Roadshow In Hyderabad

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ చేరుకున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి కాచిగూడ వరకు మోడీ రోడ్‌ షో చేపడుతున్నారు. ఈ రోడ్ షోలో బిజెపి కార్యకర్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటిదీపోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వీలైనన్నీ సీట్లు గెలిచి సత్తా చాటాలని బిజెపి అధిష్ఠానం భావిస్తోంది.

కాగా, తెలంగాణలో పలు చోట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ లో, మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌ విజయ సంకల్ప సభలో పాల్గొని బిఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.