రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతులకు మేలు
అన్నదాతలకు సాయం : హరీశ్ రావు

Hyderabad: రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతులకు మేలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. రైతుబంధుతో అన్నదాతలను ఆదుకుంటున్నామని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ రైతుల గురించి ఆలోచించలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ కేవలం పద్దుల పార్టీయేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం లేదని ఆయన చెప్పారు. నీలం తుపాన్ వచ్చి రైతులు నష్టపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని ఆయన అన్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/