అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీకి ఆహ్వానం

PM Modi invited to install Lord Ram’s idol at Ayodhya temple on January 22

న్యూఢిల్లీః ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య రామ మందిర నిర్మణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది. ఇందులో భాగంగా రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని ట్రస్ట్ ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన జరగనున్న రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి మోడీని ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు.

ఈ విషయాన్ని స్వయంగా మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ‘గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా’ “ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రారంభం నేపథ్యంలో అయోధ్యకు రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవితకాలంలో ఈ చరిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం” అని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.