మణిపూర్‌ అల్లర్లు.. హైదరాబాద్‌ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

హైదరాబాద్ నుండి స్వస్థలాలకు తరలింపు

telangana-students-reached-from-manipur

హైదరాబాద్‌: మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్థులను మణిపూర్ రాజధాని ఇంపాల్ నుండి శంషాబాద్ కు తీసుకు వచ్చారు. విమానాశ్రయం నుండి విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించారు. మొదట షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం వారిని హైదరాబాద్ తీసుకు రావాల్సి ఉంది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సోమవారం వచ్చారు.

మణిపూర్ లో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో అక్కడి విద్యార్థులను ప్రభుత్వాలు తరలిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విద్యార్థులను హైదరాబాద్ తరలించారు. మణిపూర్ లో చిక్కుకున్న వారి సహాయార్థం ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్ లలో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సహా మణిపూర్ లో ఉన్న తెలంగాణవాసుల కోసం ఆదివారం ఉదయం ప్రత్యేక విమానాన్ని పంపించారు. సోమవారం మధ్యాహ్నం విమానం వారిని తీసుకు వచ్చింది.