వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం

PM Modi inaugurates world’s largest meditation centre Swarved Mahamandir in Varanasi

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నేడు ప్రారంభించారు. వారణాసిలో ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. రామాయణ, మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి.

ఈ ధ్యాన మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్, విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోడీకి వివరించారు. ధ్యాన మందిరం పైకప్పు కమలం ఆకృతిలో ఉండడం ప్రధాని మోడీని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మోడీ ధ్యాన మందిరం మొత్తం కలియదిరిగారు.