చరణ్ తాలూకా వీడియో విడుదల చేసిన ఎన్టీఆర్ ..

చరణ్ తాలూకా వీడియో విడుదల చేసిన ఎన్టీఆర్ ..

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 09 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎన్టీఆర్ ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ చరణ్ కు సంబదించిన ప్రోమో విడుదల చేసారు. ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఒక సన్ని వేశాన్ని కట్‌ చేసి ఈ వీడియోను రూపొందించారు. పోలీస్‌ డ్రెస్‌ ధరించిన చెర్రీ మంటల్లోంచి నడుచుకురావడం ఈ క్లిప్‌లో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

Brace Yourself for RAM… @AlwaysRamCharan @ssrajamouli #RRRTraileronDec9th #RRRMovie pic.twitter.com/XPUQxmGsey— Jr NTR (@tarak9999) December 7, 2021