దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలుః ప్రధాని మోడీ

PM Modi Greets Dalai Lama On Birthday

న్యూఢిల్లీః దలైలామా 88వ జన్మదిన సందర్భంగా ప్రధామంత్రి నరేంద్రమోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అలాగే ధర్మశాలలో ఉన్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వందలాది మంది అతని అనుచరులు తరలివచ్చారు. సుగ్లాఖంగ్ ఆలయానికి వేడుకలు జరిపుకునేందుకు దలైలామ రావడంతో కళాకారులు ఆయన సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. తన జన్మదిన వేడుకలపై కూడా దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను 88వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాని.. కానీ నేను ఇప్పటికీ 50 సవంత్సారాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నానని నవ్వుతూ చెప్పారు.