భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించడం ద్వారా కరోనాపై సులువుగా విజయం

‘మన్ కీ బాత్’ లో ప్రధాని మోడీ

PM Modi
PM Modi

New Delhi: కరోనాపై విజయం సాధించగలమన్న ధీమాను ప్రధాని మోడీ వ్యక్తం చేశారు.

మన్ కీ బాత్ ద్వారా జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ఆయన భౌతిక దూరం పాటిస్తూ, తప్పని సరిగా మాస్క్ ధరించడం ద్వారా కరోనాపై సులువుగా విజయం సాధించగలమన్నారు.

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మకరోనాపై పోరులో మనం సరైన దిశలోనే వెళుతున్నామన్నారు.

దేశంలో కరోనా రికవరీ రేటు ప్రపంచంలోని మరే ఇతర దేశం కన్నా ఎక్కువగా ఉందన్నారు. ఇదే క్రమశిక్షణ, అంకిత భావంతో కరోనాపై పోరు కొనసాగించాలని మోడీ పిలుపునిచ్చారు.

పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని అన్నారు.

బొమ్మల తయారీ రంగంలోకి  యువత  రావాలని పిలుపునిచ్చారు. 

కళా నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు. ఇక్కడ తయారైన  ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలన్నారు.

అన్నదాతలను గౌరవించే సంస్కృతి భారత్ ది అని నరేంద్ర మోదీ అన్నారు.

మన వేదాల్లోనూ రైతులను గౌరవించే శ్లోకాలు ఉన్నాయన్నారు. కరోనా సంక్షోభం సమయంలో రైతులు కష్టపడి సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ ఖరీఫ్‌లో గత ఏడాది కంటే ఎక్కువ సాగు చేస్తున్నారన్నారు.  ప్రతి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/