సీఎం జగన్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటి

పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం: సీఎం జగన్‌

అమరావతి : సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ముగిసింది. సమావేశంలో పీఆర్సీపై చర్చ కొనసాగింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు. మరోసారి సీఎంతో ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నానని సీఎం జగన్ తెలిపారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. దయచేసి అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని, మంచి చేయాలన్న తపనతో ఉన్నామని తెలిపారు. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన ప్రకటన చేస్తామని వెళ్లడించారు. తాను కూడా మీ అందరి కుటుంబ సభ్యుడినని, మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నట్లు తెలిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/