మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే మోడీ, అమిత్ షా!

హైద‌రాబాద్ లో బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశం

హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. జులై 3 వ వారంలో 15వ తేదీ తర్వాత ఈ సమావేశాలు ఉండవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కూడా పాల్గొంటారు. మూడు రోజుల పాటు మోడీ, షా హైదరాబాద్‌లోనే మకాం వేస్తారని తెలిసింది. 300 నుంచి 500 మంది వరకూ బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశాలకు హాజరౌతారని భావిస్తున్నారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశాలు జరగవచ్చని భావిస్తున్నారు. తాజ్‌కృష్ణాను కూడా బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీజేపీ నేతలు తరుణ్‌చుగ్, బీఎల్ సంతోష్ సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని తెలిసింది.

కాగా 300మంది ప్ర‌ముఖులు ఉండేందుకు విడిదికి ప్లాన్ చేస్తున్నారు బిజెపి నేత‌లు. ఈ స‌మావేశానికి బిజెపి రాష్ట్ర సీఎంలు..కేంద్ర మంత్రులు హాజ‌రుకానున్నారు. వ్యూహాత్మ‌కంగా తెలంగాణ‌ను ఎంపిక చేసింది కేంద్ర పార్టీ.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/