థాయ్ లాండ్ ప్రధానితో ప్రధాని మోడి చర్చ

ప్రధాని ప్రయుత్‌కు మోడి ఫోన్‌..ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులపై చర్చ

thailand-pm -prayut-chan with pm modi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తో ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈక్రమంలో భారత ప్రధాని మోడి అనేక దేశాలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా థాయ్ లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ తో ఫోన్ లో మాట్లాడారు. దీనిపై మోడి ట్వీట్ చేశారు. ‘కరోనాకి సంబంధించిన అంశాలతో మిత్రుడు ప్రయుత్ చాన్ తో చర్చించాను. చారిత్రకంగా, సాంస్కృతికపరంగా సుదీర్ఘకాల సంబంధాలు కలిగిన ఇరుగుపొరుగు దేశాలుగా ప్రస్తుత సంక్షోభాన్ని, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న అనేక సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. కాగా, మోడి, ప్రయుత్ చాన్ ఇరుదేశాల్లో అమలవుతున్న కరోనా నివారణ చర్యలను పరస్పరం అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంక్షుభిత సమయంలో ప్రాంతీయ సహకారం ఎంతో ప్రాధాన్యతాంశం అని మోడి అభిప్రాయపడ్డారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/