నేడు మూడు దేశాల అధినేతలతో ప్ర‌ధాని సమావేశం

న్యూఢిల్లీ : గ‌త వారం రోజులుగా రష్యా-ఉక్రెయిన్​ వార్ కొన‌సాగుతోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ ప‌లు దేశాల‌పై ప‌డ‌నుంది. ఈ నేపథ్యంలో క్వాడ్ దేశాధినేతల భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఈరోజు సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని చోటు చేసుకుంటోన్న‌ పరిణామాలపై వీరు ప్ర‌ధానంగా చ‌ర్చిస్తార‌ని భార‌త విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు జరుపుతోన్న నేప‌థ్యంలో ఈ విష‌యంపై భార‌త్ త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబిస్తోంది.  అమెరికా, ఆస్ట్రేలియా, జ‌పాన్ మాత్రం ర‌ష్యా తీరును వ్య‌తిరేకిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై కూడా నేడు చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ర‌ష్యా చేస్తున్న‌ది ఆక్ర‌మ‌ణ కాదంటూ ఆ దేశానికి చైనా ప‌రోక్షంగా మ‌ద్ద‌తు తెలుపుతోన్న విష‌యం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/