ఈ వారాంతంలో కిమ్‌తో మాట్లాడుతాను: ట్రంప్‌

దీనిపై సరైన సమయంలో వివరాలు తెలియజేస్తామన్న శ్వేతసౌధం

ఈ వారాంతంలో కిమ్‌తో మాట్లాడుతాను: ట్రంప్‌
TRUMP, KIM

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దాదాపు మూడు వారాల తర్వాత ప్రజల ముందుకు వచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్వక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వారాంతంలో తాను కిమ్‌తో మాట్లాడతానని చెప్పారు. దీనిపై సరైన సమయంలో వివరాలు తెలియజేస్తామని శ్వేతసౌధం తెలిపింది. కాగా కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. సుమారు మూడు వారాల తర్వాత ప్రజల ముందుకున వచ్చినట్లు కొరియా మీడియా పలు ఫొటోలు పోస్ట్ చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/