ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం

అస‌ని తుఫానుపై కీల‌క చ‌ర్చ‌
కొత్త, పాత మంత్రుల‌తో జ‌గ‌న్ భేటీ


అమరావతి: సీఎం జగన్ అధ్య‌క్ష‌త‌న ఆ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం కాసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగిన త‌ర్వాత ఏపీ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌డం ఇదే తొలి సారి కావ‌డంతో ప్రాధాన్యం సంత‌రించుకుంది. మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో కొత్త‌గా మంత్రులుగా ప‌ద‌వులు చేప‌ట్టిన వారితో పాటు ప‌ద‌వులు కాపాడుకున్న మంత్రుల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు.

ఈ భేటీలో అస‌ని తుఫాను ప్ర‌భావంపై కీల‌క చ‌ర్చ జరిగే అవ‌కాశాలున్నాయి. ఎక్స్‌పోర్ట్‌, లాజిస్టిక్ పాల‌సీల‌కు రాష్ట్ర కేబినెట్ తెలప‌నుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. దావోస్ స‌భ‌ల‌కు వెళ్లే ప్ర‌తినిధి బృందానికి ఈ ద‌ఫా స్వ‌యగా సీఎం జ‌గ‌నే నేతృత్వం వ‌హించ‌నున్నారు. దీంతో ఈ భేటీపై కూడా కేబినెట్‌లో చ‌ర్చ జర‌గ‌నుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/