తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన ఎంపీ కేకే

తెలంగాణ భవన్ లో ఘనంగా విలీన దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కె.కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమేనని చెప్పారు.

ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం రాలేదని… ఈరోజే (సెప్టెంబర్ 17) మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు. సెప్టెంబర్ 17న విలీన దినోత్సవం జరుపుకోవడంపై వివాదాలు అనవసరమని అన్నారు. భారత్ లో మనం కూడా విలీనం కావాలని కోరుకున్నామని… ఈ అంశంపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/