పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ

మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన బిజెపి బీసీ ఆత్మ గౌరవ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ప్రశంసలు కురిపించారు. తన స్పీచ్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై విమర్శలు చేసిన మోడీ..బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేత సీఎం అవుతారని ప్రకటించారు. ఇక ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫై ప్రశంసల జల్లు కురిపించారు.

‘ఈ వేదికపై పవన్ కల్యాణ్ నాతో ఉన్నారు. మైదానంలో తుపాను (జన సునామీ) ఉంది. ఈ మైదానంలో మార్పు తుపానును నేను చూస్తున్నాను. మీరు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణకు బీజేపీపై విశ్వాసం ఉందని స్పష్టమైన సందేశం తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2014 వరకు దేశంలో ఎన్ని ఉగ్రదాడులు జరిగాయో అందరికీ తెలుసని, మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ఉగ్రదాడులను కట్టడి చేశారన్నారు. చంద్రయాన్-2 ఫెయిల్ అయినప్పుడు శాస్త్రవేత్తలను భుజం తట్టి… చంద్రయాన్-3 సక్సెస్ వైపు నడిపించారన్నారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేశారన్నారు. పీఎం కిసాన్, స్వచ్ఛ భారత్ వంటి ఎన్నో పథకాలను ప్రధాని మోదీ తీసుకువచ్చారని గుర్తుచేశారు.

మాటలు చెప్పడం సులభం, కానీ ఆచరణ చాలా కష్టం. ప్రధాని మోదీ బీసీలను సీఎం చేస్తామని ప్రకటించారు. ఆ మాటకు తప్పని సరిగా కట్టుబడి ఉంటారు. మిషన్ 2047 సక్సెస్ కావాలంటే మోదీ మరోసారి ప్రధాని అవ్వాలి. అందుకు జనసేన మద్దతుగా నిలుస్తుంది. మోదీని ఒక అన్నగా భావించి, ఆయన స్పీచ్ ల చూసి రాజకీయాల్లోకి వచ్చాను. సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది. నాలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే ప్రధాని మోదీ” అన్నారు.