తెలంగాణ ఎన్నికలు : జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన సైతం పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి కలిసి బరిలోకి దిగుతున్న జనసేన..మంగళవారం పోటీ చేస్తున్న నియోజకవర్గాల తాలూకా వివరాలను ప్రకటించింది. మొత్తం 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..ఆ 8 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను తెలిపింది.

జనసేన పోటీ చేసే స్థానాలు… అభ్యర్థులు వివరాలు ఇలా ఉన్నాయి

కూకట్‌పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు – నేమూరి శంకర్ గౌడ్
కోదాడ – మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూలు – వంగ లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం – మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ) – డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట (ఎస్టీ) – ముయబోయిన ఉమాదేవి పోటీ చేస్తున్నారు.