హత్యాయత్నం నుంచి తప్పించుకున్న అధ్యక్షుడు పుతిన్

రెండు నెలల క్రితం పుతిన్ పై హత్యాయత్నం .. ఉక్రెయిన్ ఇంటెలిజన్స్ చీఫ్

మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై రెండు నెలల కిందట జరిగిన ఓ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిలో బుదనోవ్ స్పష్టం చేశారు. ఆ విఫలయత్నం చేసింది కాకసస్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలిపాడు. న‌ల్ల స‌ముద్రం, క్యాస్పియ‌న్ స‌ముద్రం మ‌ధ్య ఉన్న కౌక‌స‌స్ ప్రాంతంలో పుతిన్‌పై హ‌త్యాయ‌త్న ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. రెండు నెల‌ల క్రితం ఈ ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్ మీడియాతో బుద‌నోవ్ ఈ విష‌యాన్ని తెలిపారు.

హ‌త్యాయ‌త్నం విఫ‌లమైంద‌ని, కానీ క‌చ్చితంగా ఆ దాడి జ‌రిగింద‌ని, రెండు నెల‌ల క్రితం ఆ దాడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌రోవైపు పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు కొన్ని రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తోంది. పుతిన్ ఆరోగ్యం చాలా క్షీణించింద‌ని, ఆయ‌న‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు ఓ ర‌ష్యా సంప‌న్నుడు వెల్ల‌డించారు. త‌న‌పై అయిదు సార్లు హ‌త్యాయ‌త్న ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు 2017లో పుతిన్ చెప్పిన విష‌యం తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/