కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటి..కీలక నిర్ణయాలు

జమ్ము కశ్మీర్ లో అత్యవసర ఐసొలేషన్ వార్డుల నిర్మాణం

PM Modi At Union Cabinet Meeting
PM Modi At Union Cabinet Meeting

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈసందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్ తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా, కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలపై ఆంక్షలు విధించింది. కరోనా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, ఏప్రిల్ 15 వరకూ ఇచ్చిన వీసాలన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించింది.

•చలి తీవ్రత అధికంగా ఉండి, కరోనా త్వరగా విజృంభించే జమ్ము కశ్మీర్ లోని ఉధంపూర్ ప్రాంతంలో 100 పడకల సామర్థ్యం గల 4 ఐసోలేషన్ వార్డులను అత్యవసరంగా సిద్ధం చేసేందుకు నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది.

•ఢిల్లీలోని విద్యాసంస్థలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ స్వాగతించింది.ఈ నెల 31 వరకూ మూసివేత నిర్ణయం అమలవుతుందని, ఆ తరువాత విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

•ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ లోనూ నెలాఖరు వరకూ స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని, కరోనా ప్రభావంపై చర్చించి, ఆయా రాష్ట్రాలు పాఠశాలలు, సభలు, సమావేశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/