వరంగల్ జిల్లాలో సర్పంచ్ వేదింపులు తాళలేక పురుగుల మందు తాగిన ఆశా వర్కర్

మహిళల ఫై వేదింపులు అనేవి రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. ప్రభుత్వాలు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కొంతమంది మగవారిలో ఏమాత్రం మార్పు , భయం రావడం లేదు. వీరి వేదింపులు తాళలేక చాలామంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. గ్రామా సర్పంచ్ వేదింపులు భరించలేక పురుగుల మందు తాగింది ఓ ఆశా వర్కర్. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపూరం మండలం నాజి తండా లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆశా వర్కర్ గా పని చేస్తున్న కునుసోత్ నీల(35) ను గత కొద్దీ రోజులుగా ఇంటి వద్ద నాజీ తండా సర్పంచ్ బాలకిషన్ వివిధ కారణాలతో వేధిస్తున్నాడు. వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ దాడి చేసే ప్రయత్నం చేసినట్లు ఆమె తెలిపింది. దాడి చేస్తున్న సమయంలో వీడియో తీయగా ఎస్సైతో చెప్పి డిలీట్ చేయించినట్లు చెప్పుకొచ్చింది. మానసిక ఇబ్బందులు నేపథ్యంలో పురుగుల మందు తాగి నట్లు ఆమె మీడియా కు తెలిపింది. ఆరోగ్య పరిస్థితి పై విధుల్లో ఉన్న వైద్యురాలు స్నేహను వివరణ కోరగా ప్రస్తుతం నీలా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపింది.