భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం

YouTube video
PM attends swearing in ceremony of Justice UU Lalit, at Rashtrapati Bhawan

న్యూఢిల్లీః భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌ 74 రోజులపాటు పనిచేయనున్నారు.

జస్టిస్ యూయూ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబర్‌ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. త్రిపుల్‌ తలాక్‌ సహా, అనేక కీలక కేసుల తీర్పుల్లోనూ జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం కిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/