పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం

పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం అయినా ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్ధవెల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్ లో తెల్లవారుజామున ఉరుములు,మెరుపులతో భారీ వర్షం పడింది. గత కొద్దీ రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త సేద తీర్చింది. ఉదయం జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, అమీర్ పేటర్ ,యూసఫ్ గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, నేరెడ్ పెట్, కుత్బుల్లాపూర్, ముషిరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, బోయిన్ పల్లి ,పాతబస్తీ , రాజేంద్ర నగర్, శేర్ లింగంపల్లి, గచ్చిబౌలి, ఏరియాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రాజేంద్రనగర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదు కాగా, అంబర్‌పేట, శేరిలింగంపల్లి, శివరాంపల్లిలో 3.9 సెం.మీ చొప్పున వర్షంపాతం నమోదైంది. కాగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్ధవెల్లి గ్రామంలో ఉదయం పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం అయ్యింది. గ్రామానికి చెందిన దిద్దెల చెన్నయ్య ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు పైన పిడుగు పడింది. చెట్టుకు దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధం అయ్యింది.