నీ ప్రవర్తన వల్ల మేం నష్టపోతున్నాం అంటూ విజయ్ ఫై సీరియస్ అయినా థియేటర్ యజమాని

విజయ్ దేవరకొండ మాట తీరు..ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన అభిమానులకు ఆయన శైలి నచ్చవచ్చు కానీ సామాన్యులకు మాత్రం ఏమాత్రం నచ్చదు. తాజాగా ఇదే విషయాన్నీ ఓ థియేటర్ యజమాని చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఇదే టాక్ వచ్చింది. ఈ క్రమంలో సినిమా డిజాస్టర్ కావడానికి కారణం విజయ్ దేవరకొండే అని ముంబై లోని ఓ థియేటర్ యజమాని తెలిపాడు.

ముంబయికి చెందిన థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన సినిమాను బాయ్ కాట్ చేసుకోండంటూ చెప్పి తెలివిని ప్రదర్శించానని అనుకున్నాడని.. అతడి ప్రవర్తన కారణంగా సినిమాను ఓటీటీలో కూడా చూడరని తెలిపారు. నీ ప్రవర్తన వల్ల మేం నష్టపోతున్నాం. అడ్వాన్స్ బుకింగ్స్ పై కూడా ఎఫెక్టు పడింది. మిస్టర్ విజయ్.. నువ్వు కొండవి కావు అనకొండవి. అనకొండలానే మట్లాడావు. వినాశకాలే విపరీతబుద్ధి అంటారు.నాశనమయ్యే సమయం దగ్గర పడ్డప్పుడు.. నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. నువ్వు అలాగే మాట్లాడావు కూడా. నువ్వు చాలా అహంకారివి.. నచ్చితే చూడండి.. ఇష్టం లేకపోతే అసలు చూడొద్దు లాంటి మాటలు ఎంత చేటు తెచ్చాయో నీకింకా అర్థం కావటం లేదా?” అంటూఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేసారు. పూరి – విజయ్ దేవరకొండ కలయికలో సినిమా అనగానే అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాక్సింగ్ నేపథ్యంలో కథ..మైక్ టైసన్ నటించడం..పాన్ ఇండియా గా విడుదల కావడం తో అభిమానులు ఎన్నో ఆశలతో థియేటర్స్ కు వెళ్లారు. కానీ థియేటర్స్ కు వెళ్లిన అభిమానుల ఆశలపై పూరి నీళ్లు చల్లాడు. అసలు ఇది పూరి..విజయ్ తో చేయాల్సిన సినిమానేనా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పూరి సినిమా అంటే పంచ్ డైలాగ్స్ , హీరో క్యారెక్టర్, అదిరిపోయే క్లైమాక్స్ , హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్ , కామెడీ ఇలా చాలానే ఎక్స్పెట్ చేస్తారు. కానీ లైగర్ లో మాత్రం అవేమి లేకపోవడం తో అభిమానులు బాగా నిరాశకులోనయ్యారు. ఇక సోషల్ మీడియా లో పూరి ఫై ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తూ ట్రోల్ల్స్ చేస్తున్నారు.