నేడు రాష్ట్రంలో జేపీ నడ్డా పర్యటన.. కెటిఆర్‌ విమర్శలు

నడ్డా చెప్పులు మోసే గులామ్‌ ఎవరు?.. కెటిఆర్‌ ట్వీట్‌

minister-ktr

హైదరాబాద్ః నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్‌ ఎవరు అంటూ మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రశ్నవేశారు. దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా చెబుతున్నానని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

కాగా, ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్‌ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన అమిత్‌ షా కు.. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పులు అందించిన విషయం తెలిసిందే. మరి నేడు జేపీ నడ్డాకు చెప్పులు మోసేదెవరంటూ మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/