ప్లాస్మా దానం

ఎంఎం కీరవాణి, కాలభైరవ ప్రకటన

MM Keeravaani
MM Keeravaani

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.. కొన్ని రోజుల క్రితం దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కరోనా బారినపడి దాన్ని జయించారు.

అయితే ఆ తర్వాత వీరిద్దరూ ప్లాస్మా దాన ంచేసి మేం కూడ రియల్‌హీరోలు అన్పించుకుంటామని తెలిపారు.

ఇపుడు అలా అన్నట్టుగానే మొదటి కీరవాణి ప్లాస్మా డొనేట్‌ చేసినట్టుగా తెలిపారు.

కిమ్స్‌ ఆసుపత్రిలో డొనేట్‌చేశామని, ఇదంతా సాధారణ రక్తదానం లానేఉంటుందని ఎవరూ భయపడనక్కర్లేదని , ధైర్యం చెప్పారు..

అలాగే కీరవాణితోపాటు యువ సంగీత దర్శకుడు, సింగర్‌ కీరవాణి తనయుడు కాలభైరవ కూడ ప్లాస్మా డొనేట్‌ చేసినట్టుగా తెలిపారు..

అంతేకాకుండా కరోనా నుంచి ఎవరెవరు బయటపడ్డారో వారంత కచ్చితంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నట్టుగా కాలభైరవ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/